NLR: కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు రాజకీయాలు అంటే హుందాతనంగా ఉంటాయని, అయితే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ దుండగులు చేసిన దాడి ఫ్యాక్షన్ తరహాలో ఉందని అన్నారు. వైసీపీ ప్రసన్న కుమార్ రెడ్డికి అండగా ఉంటుందని తెలిపారు.