మేడ్చల్: ఉప్పల్ మండలం పరిధిలో నూతనంగా ఏడు ప్రభుత్వ పాఠశాలలో మంజూరు చేశారు. ఈ మేరకు పాఠశాలల మంజూరుపై వివరాలను ఉప్పల్ ఎంఈవో రామారావు తెలిపారు. మండల పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీ, సింగం చెరువు తండా, ఆదర్శ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, మల్లికార్జున్ నగర్, దేవేందర్ నగర్, ఉప్పల్ భగాయత్ ప్రాంతాల్లో నూతన ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి.