SRD: మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు చంద్రయ్యకు, అదే గ్రామానికి చెందిన పైతర సాయికుమార్ టీవీఎస్ 4 చక్రాల వాహనాన్ని మంగళవారం స్వచ్ఛందంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహనం అందజేసిన దాతకు దివ్యాంగుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, భాగన్న ఉన్నారు.