SRPT: యాదాద్రి టౌన్షిప్ సమీపంలోని కంప చెట్లలో ఇవాళ సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సుమారు 35 ఏళ్ల వయస్సున్న మృతుడు బీహార్‌కు చెందినవాడిగా భావిస్తున్నారు. మతిస్థిమితం లేని స్థితిలో గత రెండు సంవత్సరాలుగా మఠంపల్లి ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.