ప్రకాశం: ఒంగోలు నగరానికి చెందిన అంబటి ఖశ్వి అనే చిన్నారి(17 నెలలు) వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో స్థానం దక్కించుకుంది. మంగళవారం ఖశ్వి ని ఎస్పీ కార్యాలయంలో దామోదర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖశ్వి అరుదైన ఘనతను సాధించిందని, కేవలం ఒంగోలుకే కాకుండా జిల్లాకే గర్వకారణమన్నారు.