NLR: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తీవ్రంగా ఖండించారు. కాగా, ఆయన మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా సంస్కారహీనంగా మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు మహిళలపై గౌరవం ఎప్పటికీ లేదని విమర్శించారు.