కృష్ణా: పామర్రులో మాజీ MLA కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం మంగళవారం జరిగింది. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని వైసీపీ నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఉప్పాల రాము, హారిక, సింహాద్రి రమేష్, దేవా భక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.