ADB: శాంతి భద్రతల పరిరక్షణ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోథ్ నూతన ఎస్సై ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతారెడ్డి, నాయకులు హిరాసింగ్, స్వామి, శంకర్, సద్దాం, అశోక్ తదితరులున్నారు.