NLR: కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జడ్పీ సీఈవో మోహన్ రావు మంగళవారం తనిఖీ చేశారు. రామాపురం, ఎన్టీఆర్ నగర్ ఎస్టీ కాలనీని సందర్శించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.