VKB: మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉద్యమకారునిగా రమేష్ కుమార్ పనిచేశారని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్పీకర్ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రమేష్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను చేపట్టి ప్రజలకు మంచి సేవలు అందించాలని స్పీకర్ ఆకాంక్షించారు.