SKLM: విద్యా సంస్థల పరిసరాల్లో నిషేధిత ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమదాలవలస సీఐ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆమదాలవలసలో పాఠశాలల పరిధిలో ఉన్న పలు దుకాణాలను తనిఖీ చేశారు.ఆపరేషన్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. కిరాణా షాపుల్లో సిగరెట్టు, గుట్కా తదితర ఉత్పత్తులు అమ్మకాలను చేయకూడదని అన్నారు.