KDP: ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేయాలని ముద్దనూరు ఎంపీడీవో రాధాకృష్ణవేణి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సభా భవనంలో పంచాయతీల పురోగతి సూచికపై మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆమె పేర్కొన్నారు.