NLR: చేజర్ల మండలంలోని ఏటూరు, వావిలేరు గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి హిమ బిందు రైతులకు పలు సూచన చేశారు. పంట వేసిన రైతులందరూ తప్పనిసరిగా ఈక్రాప్ నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం కలుపు నివారణ చర్యలు గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.