KNR: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు మేకల తిరుపతి ఆధ్వర్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.