CTR: గుడిపాల మండలం బుచ్చన్న కండ్రిగకు చెందిన ఆర్మీ సైనికుడు మొగిలి నాయుడు భూమిని ఆక్రమించేందుకు పెదనాన్న మునేంద్ర నాయుడు కుటుంబం దౌర్జన్యం చేసిందని ఆరోపించారు. మంగళవారం ప్రెస్ క్లబ్ల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం తన తల్లిపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని వాపోయారు.