ELR: గణపవరం మండలం కొమర్రులో నిర్వహించిన “పల్లె పల్లెకు పత్సమట్ల” కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రజలతో మమేకమై ప్రజాల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన గురించి వివరించారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలు, అభ్యర్ధనలు గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.