PDPL: రేపటి దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు ఎవరు పాల్గొనవద్దని రామగుండం జీఎం లలిత్ కుమార్ కోరారు. ఏదైనా సమస్య ఉంటే యూనియన్ నాయకుల మధ్య పరిష్కరించుకుందామని అన్నారు. సింగరేణితో సంబంధం లేని అంశాలను లేవనెత్తి కార్మికులకు అన్యాయం చేయడం సరైన విధానం కాదన్నారు. ఒకరోజు సమ్మె వల్ల సంస్థకు రూ. 76 కోట్ల నష్టం, కార్మికుల వేతనాలు రూ.13 కోట్లు నష్టపోతారని పేర్కొన్నారు.