హిమాచల్‌ప్రదేశ్‌లోని సియాథి గ్రామం భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయింది. గ్రామానికి చెందిన నరేంద్ర జూన్ 30న అర్ధరాత్రి కుక్క అరుపులు విని నిద్రలేచాడు. ఇంట్లోని గోడకు పగుళ్లు రావడం, నీరు లీకేజీ కావడంతో గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. దీంతో గ్రామంలోని 67 మంది గ్రామాన్ని విడిచి వెళ్లారు. ఆ తర్వాత కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.