దర్శకుడు H.వినోద్‌తో హీరో ధనుష్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధనుష్‌కు కథను వినిపించగా.. అతను ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక దర్శకుడు.. ‘ఖాకీ’, ‘వలిమై’, తెగింపు సినిమాలను తెరకెక్కించగా.. ప్రస్తుతం ‘జననాయగన్’ మూవీతో బిజీగా ఉన్నాడు.