NGKL: మాజీ సీఎం YS.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కొల్లాపూర్ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాజీ సీఎం ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుచుకుళ్ల రాజేష్ రెడ్డి , కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.