W.G: విద్యుత్ శాఖలో పలువురిని బదిలీలు చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లిగూడెం డివిజన్ కార్యాలయ జూనియర్ అకౌంట్స్ అధికారి టి. వెంకాయమ్మకు ఉద్యోగోన్నతి కల్పించి, ఏలూరు నగర విద్యుత్తు రెవెన్యూ కార్యాలయం అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా నియమించారు. కోనసీమ జిల్లాలో ఏడీఈగా పనిచేస్తున్న రఘురాజను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారు.