VZM: లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా మే 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని మున్సిపల్ కార్మికులు చెప్పారు. బొబ్బిలిలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వద్ద బుధవారం మున్సిపల్ కార్మికులతో సమావేశమయ్యారు. సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరరావు కోరారు.