PPM: గుమ్మలక్ష్మీపురం మండలం బద్రగిరి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సీహెచ్ సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. ఏడాది తొలి విడత ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి మే 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిషియన్ 20, ఫిట్టర్ 20, కంప్యూటర్ 48, వెల్డర్ 20, డ్రెస్ మేకింగ్ 40 సీట్లు చొప్పున భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.