ATP: బ్రహ్మాసముద్రం మండలం పడమటి కోడిపల్లి సమీపంలో బీటీపీ హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పనులను ఎంపీ అంబిక, ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పునఃప్రారంభించారు. రాయలసీమకు జీవనాడిగా నిలిచే ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేస్తామని నేతలు తెలిపారు. నీటి ప్రాజెక్ట్‌లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు.