GNTR: పొగాకు మొత్తం కొనాలని, లేనిచో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రామారావు హెచ్చరించారు. శనివారం పెదకాకాని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనాలని నాసిరకంగా ఉందని తిరస్కరించడం సరికాదని చెప్పారు. ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.