VZM: ఈ నెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2232 పాఠశాల నుండి 2,10,377 మంది విద్యార్ధులు హాజరవుతారన్నారు.