MDK: ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ అన్నారు. మెదక్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మంది అభ్యాసకులను చేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.