MDK: అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హై స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు ట్రీపుల్ ఐటీ బాసరకు ఎంపికైనట్లు HM రమేష్ తెలిపారు. పాఠశాలకు చెందిన ఇప్ప తేజశ్రీ, అఖిల్, నందు, చాకలి కీర్తన, స్రవంతి ట్రీపుల్ ఐటీకి ఎంపికైనట్లు వివరించారు. ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.