NLR: నగర పాలక సంస్థ పరిధిలో టాక్స్ రివిజన్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత కల్పించి, నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో సర్వేను పూర్తి చేయాలని కమిషనర్ నందన్ రెవెన్యూ అధికారులకు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గృహాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేయాలని, నివేదికలను గూగుల్ షీట్స్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు.