NZB: జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు రూ. 3.23 కోట్లు విడుదలైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. జూనియర్ కళాశాలల బలోపేతం కోసం మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు రంగులు, ఫర్నిచర్, బ్లాక్ బోర్డుల నిర్మాణానికి నిధులను వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.