NLG: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు, అలాగే PGMSTH నందు ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి 1:1 నిష్పత్తి అభ్యర్థుల జాబితా డీఈవో వెబ్సైట్, కార్యాలయం నోటీసు బోర్డుపై ఉంచడం జరిగిందని డీఈవో తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 7న మ.12 గంటల లోపు ఆధారాలతో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.