ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. 205 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన DC 20 ఓవర్లలో 190/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో KKR..14 రన్స్ తేడాతో గెలిచింది. DC బ్యాటర్లలో డుప్లెసిస్(62), అక్షర్(43), విప్రజ్(38) పరుగులతో రాణించారు. KKR బౌలర్లలో నరైన్ 3, చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు.