PDPL: అల్లూరు గ్రామంలో శనివారం రాత్రి జాతీయ పక్షి నెమలిపై కుక్కలు దాడిచేస్తుండగా స్థానికులు గుర్తించి కాపాడారు. టుటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని జాతీయ పక్షి నెమలిని స్వాధీనం చేసుకున్నారు.