ప్రకాశం: ఎన్డీఏ కూటమి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కనిగిరి పట్టణంలోని ఒకటో వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మెల్యే ఉగ్ర ఆధ్వర్యంలో కనిగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.