MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు.