NZB: మెండోరా మండల ఎస్సైగా జాదవ్ సుహాసిని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మెండోరా ఎస్సైగా ఉన్న యాసర్ అర్ఫాత్ నిజామాబాద్ కమిషనరేట్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. ట్రైనీ ఎస్సైగా ఉన్న సుహాసినికి మెండోరా బాధ్యతలు అప్పగించారు. మే 1న బాధ్యతలు చేపట్టిన అర్ఫాత్ కేవలం రెండు నెలల్లోనే బదిలీ కావడం గమనార్హం.