GDWL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయానికి ప్రాజెక్టుకు 1,10,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో, ప్రాజెక్టులోని 12 గేట్లు ఎత్తి 1,11,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.