GDWL: రైలు డోర్ వద్ద నిద్రమత్తులో జారిపడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి తిరుపతికి స్నేహితులతో కలిసి రైలులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని నవాబ్‌పేట్ మండలం కారుకొండ గ్రామానికి చెందిన నరేందర్ (48)గా గుర్తించారు.