GDWL: గట్టు మండలంలో ఆవాజ్ కమిటీ చైతన్య యాత్ర ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికూర్ రహ్మాన్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులు హరించబడుతున్నాయని,పేదరికం, నిరుద్యోగం, మత విద్వేషాలతో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 13-14న గద్వాలలో ఆవాజ్ మహాసభలు, ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.