TG: BRS హయాంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని DY. CM భట్టి విక్రమార్క విమర్శించారు. తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని, ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 54 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30 వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని భట్టి అన్నారు.