విశాఖ: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో రేకుల షెడ్డు కూలిన ఘటన తెలిసిందే. గిరి ప్రదక్షిణ కోసం తొలి పావంచా వద్ద రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. అయితే పునాదుల్లో కాంక్రీట్ వేయకపొవడంతో బరువుకు భారీ షెడ్డు కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.