KDP: ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సప్లయర్ దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి హోటల్లో పని చేస్తున్న బాలికను మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా 6 నెలల గర్భిణిగా వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.