ప్రకాశం: సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట మైనింగ్ చెక్ పోస్ట్ వద్ద గ్రానైట్ లోడుతో వెళ్తున్న భారీ లారీలను మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చీమకుర్తి మైనింగ్ నుంచి రామాయపట్నం పోర్టుకు గ్రానైట్ తరలిస్తున్న లారీ డ్రైవర్లను ఆపి సోదాలు చేశారు. మద్యం తాగి ఉన్నారా లేదని పరిశీలించారు. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలని ఆరా తీశారు.