ప్రకాశం: జిల్లాలో నేడు పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ తెలిపారు. ఒంగోలులో ఏడు పరీక్ష కేంద్రాలు, మార్కాపురంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 4,600 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాస్తున్నట్లుగా తెలిపారు.