• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

25లోగా రైల్వేఅండర్ పాస్ ప్రారంభించాలి

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర కల్యాణ మహోత్సవం ఈనెల 26న జరుగనున్న సందర్భంగా ఆలయ సమీపంలోని నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని 25లోగా ప్రారంభించాలని పట్టణ నాయకులు కాంట్రాక్టర్‌కు సూచించారు. శనివారం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ వెంకన్నతో కలిసి పరిశీలించారు.

February 9, 2025 / 12:10 PM IST

ఢిల్లీ కొత్త సీఎం ప్రకటనపై ఉత్కంఠ

ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. కాగా సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. అయితే రేపటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన ఉండగా, దాని కంటే ముందే ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

February 9, 2025 / 11:29 AM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో 8వ విడత సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం ఆర్ఎఫ్ విషయంలో ఉదారంగా స్పందిస్తున్న సీఎం చంద్రబాబుకు  కృతజ్ఞతలు తెలిపారు.

February 9, 2025 / 11:24 AM IST

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

ఛతీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.

February 9, 2025 / 11:14 AM IST

‘ప్రజలకు ఉపయోగకరంగా వైద్య శిబిరాలు’

బాపట్ల: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. వేమూరు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిభిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్రామంలోని ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.

February 9, 2025 / 11:07 AM IST

ఊరకొండ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ప్రకాశం: పామూరు మండలంలోని ఊరకొండ వద్ద ఉన్న మట్టి కుప్పల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతను సుమారు 2, 3 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి 60 నుంచి 65 సంవత్సరాల వయసు ఉంటుంది. కనిగిరి గవర్నమెంట్ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు.

February 9, 2025 / 10:52 AM IST

‘ఆలపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

పల్నాడు: పెదకూరపాడులో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కెకె. చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

February 9, 2025 / 10:30 AM IST

గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విప్

MHBD: మరిపెడ మండలం తానంచర్ల గంగమ్మ ఆలయాన్ని నేడు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు ఆలయంలో భక్తులతో కలిసి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 9, 2025 / 10:15 AM IST

కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: జిల్లా కేంద్రంలోని 22వ వార్డు బాలాజీ నగర్‌లో గల కుట్టు శిక్షణ కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకురాలు హసీనాతో శిక్షణ కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రామానంద తీర్థ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కేంద్రంను ఏర్పాటు చేశారని, నేటి వరకు 3 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణను ఇచ్చామని తెలిపారు.

February 9, 2025 / 09:58 AM IST

పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MBNR: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాషాబుగుట్ట హైస్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు, క్లాస్ రూమ్స్, వంటశాల, స్టోర్‌రూంను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన త్రాగునీరు, పరిసరాలు, భోజనంలో పరిశుభ్రత పాటించాలన్నారు.

February 9, 2025 / 09:54 AM IST

13మద్యం షాపులకు 387 దరఖాస్తులు

E.G: జిల్లాలో కల్లు గీత కులాల వారికి కేటాయించిన 13 మద్యం షాపులకు శనివారం గడువు ముగిసే సమయానికి 387 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. ఆదివారం మద్యం షాపుల దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 12న రాజమండ్రి DRDO కార్యాలయం వద్ద మద్యం షాపులకు లాటరీ తీస్తామన్నారు. అనంతరం షాపులు కేటాయిస్తామన్నారు.

February 9, 2025 / 09:08 AM IST

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

MLG: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు.

February 9, 2025 / 09:02 AM IST

ట్రామా సెంటర్ ఏర్పాటుకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న ట్రామా సెంటర్, స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ రెండు సెంటర్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 9, 2025 / 08:48 AM IST

ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్సు

గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు బయలుదేరుతుంది.

February 9, 2025 / 08:39 AM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మల్లురవి

NGKL: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క‌తో కలిసి ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావలసిన వెనుకబాటు జిల్లాల ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు.

February 9, 2025 / 08:32 AM IST