TG: ఖమ్మం జిల్లా బోదులబండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని సూచించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామని హెచ్చరించారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని స్పష్టం చేశారు.