స్టార్ హీరోయిన్ సమంత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నాడు. అయితే సమంత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అతడితో త్వరలోనే మూడు ముళ్లు వేయించుకోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.