MNCL: జిల్లా తాండూర్ మండల కేంద్రం లోని SC కాలనీలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పోయ్యి పై నాయకులు వంట వండడం జరిగింది. గురువారం మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై రూ.50 పెంచడం దారుణమన్నారు. క్రడ్ ఆయిల్ ధరలు తగ్గినందున గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.