VZM: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్(వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీడీఓ ఎస్. రామకృష్ణ, గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పనులను పరిశీలిస్తుందన్నారు.