AP: మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు సిట్ ఆఫీస్ వద్దకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్.. ‘విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి. ఆయన TDP స్క్రిప్ట్ చదువుతున్నాడు. జగన్ సన్నిహితులపై బురద చల్లాలనే మిథున్ రెడ్డికి సిట్ నోటీసులిచ్చింది. కూటమి ప్రభుత్వంలో మద్యంపై సిట్ విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు.